ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల, జూలై 21 : రాష్ట్ర వ్యాప్తంగా 9రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మె సమ్మె బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాల పెంచాలని పలు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని సమ్మె చేపట్టారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన మద్దతును తెలియజేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు పూర్తి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని వారి జీతభత్యాలను 26 వేల రూపాయల వరకు పెంచాలని కోరారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కరోనా పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పక్షాన నిలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించామని, ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెబుతున్నారని, అటువంటి ఈ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. సమ్మె బాట పట్టిన కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులు ఎన్నడూ కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్లపైకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితులు లేవని, ఈ కూటమి ప్రభుత్వంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేక పోవడం వల్ల సమ్మె చేయాల్సి వచ్చిందని తెలుస్తుందన్నారు. కార్మికులకు 26 వేల జీతాన్ని ఇవ్వాలని ఆప్కాస్ రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని అలాగే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు చేయాలని ,వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైఎస్ఆర్సిపి నంద్యాలజిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నంద్యాలజిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పివి రమణ, కౌన్సిలర్స్ ఆరిఫ్, సాధిక్ భాష, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ నాయక్ , జలీల్ భాషా, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button